
నటసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. NBK108 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ” బ్రో ఐ డోంట్ కేర్ ” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మరో షెడ్యూల్ కు రెడీ అయ్యింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ” అందాల ఆడబొమ్మ ” అనే పాటను రీమిక్స్ చేయనున్నారట.
సమరసింహారెడ్డి చిత్రంలోని ఆ పాట బ్లాక్ బస్టర్ అనే సంగతి తెలిసిందే. బాలయ్య – అంజలా ఝవేరి మీద చిత్రీకరించిన అందాల ఆడబొమ్మ పాట ఒక ఊపు ఊపేసింది. కట్ చేస్తే ఆ పాటను ఇన్నాళ్ల తర్వాత బాలయ్య రీమిక్స్ చేయనున్నాడట. అనిల్ రావిపూడి ఈ ఐడియా చెప్పగానే బాలయ్య కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
బాలయ్య ఈ చిత్రంలో మూడు రకాల పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. యువకుడిగా , మధ్య వయస్కుడిగా అలాగే వృద్ధుడిగా ఇలా విభిన్న పాత్రలలో కనిపించనున్నాడట. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసారు. అలాగే అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల ఇందులో బాలయ్య కూతురుగా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.