38.5 C
India
Thursday, March 28, 2024
More

    శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత.. హైదరాబాద్ కు తరలింపు

    Date:

    Sarath Babu
    Sarath Babu

    నాటి తరం హీరోగా.. నేటి తరానికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సుపరిచితులైన సీనియర్ నటుడు శరత్ బాబు అస్వస్థతకు గురయ్యారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం ఆయనను తెలంగాణకు తరలించారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో కుటుంబసభ్యులు చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

    మూడు వారాల కిందట అస్వస్థతకు గురైన శరత్ బాబు బెంగళూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి పరిస్థితి మెరుగు కాకపోవడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆస్పత్రికి గురువారం తరలించారు. అతడికి కావాల్సిన వైద్య పరీక్షలతో పాటు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యం మెరుగవుతోందని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. కాగా శరత్ బాబు అనారోగ్యం విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమకుచెందిన వారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

    తెలుగులో శరత్ బాబు చివరి సినిమా పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ . ఆయన 1973లో ‘రామరాజ్యం’ సినిమాతో సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు. అనంతరం వరుస చిత్రాలు చేస్తూ ఎన్టీఆర్, ఏఎన్నార్ , కృష్ణలకు సమాన స్థాయిలో గుర్తింపు పొందారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో శరత్ బాబు నటించారు. అప్పట్లో కథ నాయకుడిగా నటించిన శరత్ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నట జీవితం మొదలుపెట్టారు. దాదాపు ఆయన 250కి పైగా సినిమాల్లో నటించారు.

    Share post:

    More like this
    Related

    Election King : 238సార్లు ఓడినా.. మళ్ళీ పోటీ కి సిద్ధం అయిన.. ఓ నాయకుడు..! 

    Election King : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తమిళనాడుకు చెందిన...

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    Punjab CM : 50 ఏళ్ల వయసులో తండ్రి అయిన పంజాబ్ ముఖ్యమంత్రి..

    Punjab CM : పంజాబ్ సీఎం భగవoత్  సింగ్ మాన్ 50...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP-Telangana : తెలంగాణకు ఏపీ సర్కార్ అద్దె కట్టక తప్పదా..? 

    AP-Telangana : తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజ ధాని గడువు...

    Cyber Scam : ఒక ఫోన్ కాల్ తో 30 లక్షలు పోగొట్టుకున్న పిహెచ్ డీ స్కాలర్..

    Cyber Scam : కొత్త తరహా నేరాలతో సైబర్ కేటుగాళ్లు విజృంభి...

    Hyderabad : హైదరాబాద్‌ వాసులకు అలెర్ట్

    Hyderabad : రాష్ట్రంలో ఆదివారం నుంచి గురువారం వరకు ఉష్ణోగ్రతలు పెరిగే...

    Joint Capital : మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ – ఆదేశాలివ్వండి..!!

    Joint Capital : ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తవుతోంది. ఏపీ...