
టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. సీనియర్ నటుడు మాదల జయభాస్కర్ ( 82 ) మృతి చెందారు. అయితే ఆలస్యంగా ఈ విషయం వెలుగు చూసింది. జయభాస్కర్ ఈనెల 2 న మరణించారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు జయభాస్కర్. తెలుగులో 300 కు పైగా చిత్రాల్లో నటించారు జయభాస్కర్. అయితే ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. చిన్న చిన్న పాత్రలతో పాటుగా విలన్ పాత్రల్లో కూడా నటించారు. జయభాస్కర్ కుటుంబంతో సహా విశాఖపట్నంలో ఉంటున్నారు దాంతో ఆయన మరణవార్త ఆలస్యంగా వెలుగుచూసింది. జయభాస్కర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.