
సీనియర్ నటి రమాప్రభ ఆర్ధిక పరిస్థితి ఘోరంగా ఉందని , ఆమె అడుక్కు తింటోందని రకరకాల పుకార్లు పలు యూట్యూబ్ ఛానల్ లలో ప్రసరమౌతున్నాయి. ఈ పుకార్లు రమాప్రభ చెవిన పడటంతో ఘాటుగానే స్పందించింది. నేను బేషుగ్గా ఉన్నాను …… నాకు బ్రహ్మాండమైన ఇల్లు ఉందని ఎంచక్కా నా యూట్యూబ్ ఛానల్ లోనే పెట్టాను ….. ఇంకా అడుక్కోవడానికి సమయం ఎక్కడుంది ? అంటూ ప్రశ్నించింది.
నాకు నాగార్జున , అలాగే పూరీ జగన్నాథ్ అప్పుడప్పుడు సహాయం చేస్తూనే ఉన్నారు ….. వాళ్ళ దగ్గర తప్పేముంది ….. వాళ్ళు నాకు ప్రేమతో ఇస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది రమాప్రభ. 75 సంవత్సరాల వయసున్న రమాప్రభ 1400 కు పైగా చిత్రాల్లో నటించింది. కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. హాస్య నటిగా కూడా సత్తా చాటింది.
అయితే ఇటీవల కాలంలో వయసు మీద పడటంతో సినిమాల్లో పెద్దగా నటించడం లేదు. అలాగే పెద్దగా పాత్రలు కూడా రావడం లేదు. దాంతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంది. నేను చాలా సంతోషంగా ఉన్నానని , డబ్బుకు ఎలాంటి ఇబ్బంది లేదని …… అవసరమైతే నాగార్జున , పూరీ జగన్నాథ్ లాంటి వాళ్ళు ఎంతో కొంత ఇస్తూనే ఉన్నారని అంటోంది.