55 ఏళ్ల వయసులో కూడా గ్లామర్ తో అదరగొడుతోంది సీత. 80 – 90 వ దశకంలో హీరోయిన్ గా నటించిన ఈ భామ తెలుగు , తమిళ్ , మలయాళ , కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో ఈ భామను పార్తీపన్ హీరోయిన్ గా పరిచయం చేసాడు. దాంతో కొన్నాళ్ల తర్వాత పార్తీపన్ – సీత పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు కాపురం బాగానే జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా. అయితే కాపురంలో కలతలు చెలరేగడంతో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత కొన్నాళ్ళకు ఓ సీరియల్ నటుడ్ని పెళ్లి చేసుకుంది. అయితే ఆ పెళ్లి కూడా పెటాకులే అయ్యింది. ఇప్పుడు తల్లి , అత్త పాత్రల్లో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. నటనకు అంతగా ప్రాధాన్యమున్న పాత్రలు లభించకపోవడంతో నటన పరంగా సంతృప్తి లేకపోయిందట. అయితే తనకు 55 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ గ్లామర్ ను ప్రదర్శించడంలో ఎలాంటి వెనకడుగు వేయడం లేదు ఈ భామ. అందంగా ముస్తాబు అవుతూ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో తన ఫోటోలను , వీడియోలను పెడుతూ కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తోంది.