27 C
India
Monday, June 16, 2025
More

    సెన్సేషల్ డైరెక్టర్ నక్కిన త్రినాధరావు విడుదల చేసిన “క్షణం ఒక యుగం” ఫస్ట్ లుక్ పోస్టర్

    Date:

    Sensational director Nakkina Trinadha Rao's first look poster of "Kshanam Oka Yugam"
    Sensational director Nakkina Trinadha Rao’s first look poster of “Kshanam Oka Yugam”

    శ్రీ రూపా ప్రొడక్షన్ పతాకంపై మనీష్,మధు నందన్, లావణ్య, అక్సా ఖాన్, అలివియా ముఖర్జీ హీరో, హీరోయిన్స్ గా శివబాబు దర్శకత్వంలో రూప నిర్మించిన చిత్రం “క్షణం ఒక యుగం”.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్బంగా “క్షణం ఒక యుగం” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను బ్లాక్ బస్టర్ మూవీ “ధమాఖా” డైరెక్టర్ నక్కిన త్రినాధరావు గారి చేతుల మీదుగా గ్రాండ్ గా విడుదల చేశారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైజాగ్ లో ఉన్న నా ఫ్రెండు “క్షణం ఒక యుగం” సినిమా గురించి చెప్పడం జరిగింది. దాంతో నేను ఈ సినిమా పోస్టర్ రిలీజ్ చేయడానికి రావడం జరిగింది. పోస్టర్ చాలా బాగుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గెటప్ లో ఉన్న రూప పోస్టర్ ను చూడగానే ఇది పోలీస్ కథ అనుకున్నాను. కానీ శివ ఇది లవ్ స్టోరీ ఏ కానీ ఇందులోని కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అన్నారు. ఇందులో ఇద్దరు హీరోలు ముగ్గురు హీరోయిన్స్ కూడా నటించారని తెలిసింది.. దర్శకుడు సూర్ల శివ బాబు మంచి కథను సెలెక్ట్ చేసుకొని చాలా బాగా చేశాడు. తనకు ఈ సినిమా తర్వాత బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

    Sensational director Nakkina Trinadha Rao's first look poster of Kshanam Oka Yugam
    Sensational director Nakkina Trinadha Rao’s first look poster of Kshanam Oka Yugam

    చిన్న సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ వారు తీసిన సినిమా కొంత సక్సెస్ అయినా కూడా వెనక్కి వెళ్లకుండా మళ్ళీ కొత్త సినిమాలు చేస్తూనే ఉంటారు కాబట్టి అలాంటి వారిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ద్వారా కొత్త వారిని ఒక ప్లాట్ ఫామ్ మీదకు తీసుకు వచ్చి ఎంకరేజ్ చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాత రూప గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. ఇకముందు కూడా రూప టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ తను ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

    చిత్ర నిర్మాత రూప మాట్లాడుతూ.. మేము అడిగిన వెంటనే మా మూవీ పోస్టర్ ను లాంచ్ చేయడానికి వచ్చిన దర్శకులు నక్కిన త్రినాథరావు గారికి ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది నటీ, నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చిందని అన్నారు.

    Sensational director Nakkina Trinadha Rao's first look poster of Kshanam Oka Yugam
    Sensational director Nakkina Trinadha Rao’s first look poster of Kshanam Oka Yugam

    చిత్ర దర్శకుడు శివ బాబు మాట్లాడుతూ.. నేను చెప్పిన కథను, నన్ను నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాత రూప గారికి ముందుగా నా ధన్యవాదాలు. అలాగే మా సినిమా పోస్టర్ ను లాంచ్ చేయడానికి వచ్చిన ధమాకా మా మాసివ్ దర్శకులు డబుల్ ధమాకా హిట్ ఇచ్చిన 100 కోట్లు కొల్లగొట్టిన నక్కిన త్రినాథరావు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం.
    సినిమాలలో చిన్న పెద్ద తేడా ఉంటుందేమో అయన ఆశీర్వాదం లో చిన్న పెద్ద తేడా ఉండదు మా సినిమా పోస్టర్ లాంచ్ చేసి మా టీమ్ ని ఎంక్రైజ్ చేసి ఫుల్ జోష్ ని నింపారు. ప్రత్యేక ధన్యవాదాలు.. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

    నటి అక్సా ఖాన్ మాట్లాడుతూ…మా “క్షణం ఒక యుగం” సినిమా ఫస్ట్ పోస్టర్ ని లాంచ్ చేసిన త్రినాథ్ గారికి ధన్యవాదాలు.ఇలాగే అందరూ మా సినిమాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

    నటీనటులు :-
    మనీష్, మధు నందన్
    హీరోయిన్లు :-
    లావణ్య, అలివియా ముఖర్జీ, ఆక్షాఖాన్.

    సాంకేతిక నిపుణులు
    బ్యానర్ : శ్రీ రూపా ప్రొడక్షన్
    నిర్మాత – రూప
    దర్శకుడు -సూర్ల శివబాబు
    డి. ఓ. పి : పి భరత్
    సంగీత దర్శకుడు:- ఎంఎల్ రాజా
    ఎడిటర్ :– ఎం ర్ వర్మ.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Lavanya : నటుడు రాజ్ తరుణ్, శేఖర్ బాషా నన్ను చంపేస్తారు.. నటి లావణ్య సంచలన ఆరోపణలు

    Lavanya : హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న ఈ ఘటనలో నటి లావణ్య నటుడు...

    Raj Tarun : మాల్వీ ఐయామ్ వెరీ సారీ.. నా వల్లే ఇదంతా అంటూ రాజ్ తరుణ్ ఎమోషనల్ పోస్టు..

    Raj Tarun : ముంబయికి చెందిన హీరోయిన్ మాల్వీ మాల్వోత్రాతో రాజ్...