36.5 C
India
Friday, April 10, 2026
More

    శాకుంతలం రివ్యూ

    Date:

    Shaakuntalam movie review
    Shaakuntalam movie review

    నటీనటులు : సమంత , మోహన్ బాబు , అల్లు అర్హ , దేవ్ మోహన్
    సంగీతం : మణిశర్మ
    నిర్మాత : నీలిమా గుణ
    దర్శకత్వం : గుణశేఖర్
    రిలీజ్ డేట్ : ఏప్రిల్ 14 , 2023
    రేటింగ్ : 2.5 / 5

    స్టార్ హీరోయిన్ సమంత శకుంతలగా నటించిన చిత్రం ” శాకుంతలం ”. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అగ్ర నిర్మాత దిల్ రాజు కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన శాకుంతలం చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కథ :

    విశ్వామిత్రుడు చేస్తున్న తపస్సును భగ్నం చేయడానికి భూలోకానికి మేనక ( మధుబాల ) ను పంపిస్తాడు ఇంద్రుడు. మేనక తన అందచందాలతో ఆడిపాడి విశ్వామిత్రుడి తపస్సును భగ్నం చేస్తుంది. విశ్వామిత్రుడు  – మేనకలు సంభోగించడంతో ఓ ఆడపిల్లకు జన్మనిస్తుంది మేనక. అయితే దేవలోకానికి చెందిన మేనక తన కూతురును తీసుకువెళ్లే అవకాశం లేకపోవడంతో భూలోకంలోని వదిలి వెళ్తుంది. కణ్వ మహర్షి ( సచిన్ ఖేడ్ కర్ ) ఆశ్రమానికి ఆ పాపను తరలించడంతో ఆమెకు శకుంతల ( సమంత ) అని పేరు పెట్టి పెంచుకుంటాడు.

    ఓరోజు కణ్వమహర్షి ఆశ్రమానికి దుశ్యంత మహారాజు ( దేవ్ మోహన్ ) వస్తాడు. అక్కడ శకుంతలను చూసి మోహిస్తాడు. గాంధర్వ వివాహం చేసుకుంటారు. దాంతో శకుంతల గర్భవతి అవుతుంది. అయితే అనుకోని సంఘటనలు శకుంతల జీవితంలోకి తొంగి చూస్తాయి. దాంతో పలు అవమానాలు ఎదుర్కొంటుంది. అసలు శకుంతలను దుశ్యంతుడు ఎందుకు మర్చిపోయాడు ? శంకుతల ఎలాంటి బాధలను అనుభవించింది. చివరకు ఆమెను భార్యగా అంగీకరించాడా ? లేదా ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    హైలెట్స్ :

    సమంత
    సంగీతం
    అల్లు అర్హ

    డ్రా బ్యాక్స్ :

    స్క్రీన్ ప్లే
    దర్శకత్వం
    గ్రాఫిక్స్

    నటీనటుల ప్రతిభ :

    శకుంతల పాత్రలో సమంత అద్భుతంగా నటించి మెప్పించింది. అయితే ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం కాస్త మైనస్ గా అనిపించింది. దుశ్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ బాగానే చేసాడు. అయితే తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని ముఖం కావడంతో ఆ పాత్ర తేలిపోయింది. దుర్వాస మహర్షిగా మోహన్ బాబు ఉన్నది కొద్దిసేపే అయినప్పటికీ అద్భుతంగా నిలిచి పోయే పాత్ర. అందచందాల మేనక పాత్రలో 90 లో హీరోయిన్ గా చేసిన మధుబాల నటించడమే కాస్త ఇబ్బందికరమైన అంశం. క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ . ఇక మిగిలిన పాత్రల్లో గౌతమి , అనన్య నాగళ్ళ , శివబాలాజీ , కబీర్ సింగ్ , సచిన్ ఖేడ్ కర్ , తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు.

    సాంకేతిక వర్గం :

    విజువల్స్ బాగున్నాయి , నేపథ్య సంగీతంతో అలరించాడు మణిశర్మ. అయితే గ్రాఫిక్స్ ఆశించిన స్థాయిలో లేవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక దర్శకుడు గుణశేఖర్ విషయానికి వస్తే ……. శకుంతల కథను ఎంచుకున్నాడు …… అలాగే వివరంగా అర్ధం అయ్యేలా చెప్పాడు కానీ అది ఆసక్తికరంగా లేకపోవడం పెద్ద మైనస్. ఎలాంటి మలుపులు లేకుండా అలాగే చాలా స్లో నరేషన్ తో ప్రేక్షకులు తీవ్ర అసహనానికి గురయ్యేలా చేసాడు.

    ఓవరాల్ గా :

    కొంచెం కష్టమే !.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Dil Raju : దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

    Dil Raju : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో గురువారం...

    Singer Sunitha : సింగర్ సునీతకు బిగ్ షాక్.. భర్త కంపెనీలో ఐటీ సోదాలు

    singer Sunitha : తెలంగాణలో ఉదయం నుంచి ఐటీ అధికారులు హల్ చల్...

    GameChanger Teaser: రామ్ చరణ్ బాక్సాఫీస్ గేమ్ చేంజర్ కాబోతున్నాడా? దుమ్ము దులిపేస్తున్న టీజర్

    GameChanger Teaser: మెగాఅభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్...

    Kerintha Actress Bhavana : కేరింత నటి భావన అయ్యా బాబోయ్ నువ్వేనా అసలు 

    Kerintha Actress Bhavana : దిల్ మూవీలో సినిమా పేరునే ఇంటి...