
స్టార్ హీరోయిన్ సమంత ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకుంది. తాజాగా శాకుంతలం ట్రైలర్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. కాగా ఆ వేడుకకు సమంత హాజరయ్యింది. మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత తెలుగు మీడియా ముందుకు రావడం చూసి ప్రేమాభిమానాలు కురిపించారు. దాంతో వేదిక మీదనే కన్నీళ్ల పర్యంతం అయ్యింది సామ్.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని గుణశేఖర్ దిల్ రాజుతో కలిసి నిర్మించడం విశేషం. శాకుంతలం సినిమాను ఎలాంటి విషమ పరిస్థితుల్లో నిర్మించామో గుణశేఖర్ వివరిస్తున్న సమయంలో సమంత ఒక్కసారిగా కన్నీళ్ల పర్యంతం అయ్యింది. దాంతో ఆమెని ఓదార్చడానికి ప్రయత్నం చేసారు కానీ సమంత మాత్రం ఏడుపు ఆపలేదు.
అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చాక సమంత వ్యాధి బయటపడింది. దాంతో కొంతకాలంగా ఇంటి పట్టునే ఉంటోంది. విశ్రాంతి తీసుకుంటోంది. ఇక శాకుంతలం ట్రైలర్ విషయానికి వస్తే ……. ట్రైలర్ బాగుంది. దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. శకుంతల పాత్రలో సమంత నటిస్తోంది.