39.9 C
India
Tuesday, April 21, 2026
More

    శాకుంతలా… ఎందుకిలా..?

    Date:

    Shakuntala... why
    Shakuntala… why

    ఈమధ్య విడుదల అయిన ‘శాకుంతలం’ సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. అసలు మొదటి షో నుండి ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు కనీసం చూడటానికి ఆసక్తి చూపలేదు. ఇంత ప్లాప్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. పైగా ఇది సమంత కి, దర్శకుడు గుణశేఖర్ కి చాలా పెద్ద దెబ్బ. అయితే నిర్మాత, నటుడు అయిన త్రిపురనేని చిట్టి సమంత ని చాలా తీవ్రంగా విమర్శించాడు. అనేక చానెల్స్ లో అతను ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇందులో సమంత శకుంతల పాత్రకు సరిపోదని మొదట చెప్పాను అని, తను చెప్పినట్టుగానే సినిమాలో ఆమె పాత్ర బాగోలేదని, అందుకే సినిమా ప్లాప్ అయిందని చెప్పాడు. చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో వివాదంగా
    మారాయి.

    సమంత తన సినిమాల విడుదల కి ముందు తనకి వచ్చిన వ్యాధి గురించి.. తను సెలైన్ బాటిల్ పెట్టుకొని ఎలా డబ్బింగ్ చెప్పాను అన్న విషయాలు సోషల్ మీడియాతో పాటు ప్రమోషన్స్ లో చెప్పుకుందని తప్పు పట్టాడు. అయితే ఎంతోమంది నటీనటులు హై ఫీవర్ తో షూటింగ్ చేసారని.. కానీ సమంత చేసింది కేవలం పబ్లిసిటీ మాత్రమే అని ఆరోపించాడు. ఇక సమంత పని అయిపోయిందని.. ఆమె హీరోయిన్ గా పనికి రాదని.. అందుకే పెద్ద నటుల పక్కన తీసుకోవటం లేదని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

    ఇదిలా ఉంటే.. సమంత విజయ దేవరకొండతో ‘ఖుషి’ సినిమా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ చేస్తొంది. ఇవి కాకుండా కొత్త సినిమాలు ఏమీ ఒప్పుకోలేదు. అయితే సిటాడెల్ వరల్డ్ ప్రీమియర్ షో కోసం సామ్ ఇంగ్లాడు వెళ్లింది. సిటాడెల్ టీమ్ రాజ్ అండ్ డీకే, హీరో వరుణ్ ధావన్ లతో పాటు సమంత ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంటెర్నేషనల్ ఈవెంట్ కి మ్యాచ్ అయ్యేలా బ్లాక్ డిజైనర్ వేర్ లో కనిపించి షాక్ ఇచ్చింది. అయితే సమంత లుక్స్ పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దేశం మారితే వేషం మార్చేస్తారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ శాకుంతలం ప్రమోషన్స్ లో చీర కట్టి, చేతిలో జపమాల పట్టి చాలా సాదాసీదాగా, ప్రశాంతమైన లుక్ మైంటైన్ చేశారని గుర్తు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Samantha : సమంతా..మళ్ళీ డీప్ లవ్..త్వరలో పెళ్లి బాజాలు

    Samantha : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ తన నటనతో అందరినీ...

    Samantha : సమంత వ్యాఖ్యలు : నాగచైతన్యపై పగతో ఏడుపులు ఆగవా?

    Samantha : సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్యను పరోక్షంగా విమర్శిస్తూ వ్యాఖ్యలు...

    Sobhita Dhulipala : సమంత దుస్తుల్లో శోభిత ధూళిపాళ్ల: వైరల్ అవుతున్న వీడియో!

    Sobhita Dhulipala : శోభిత ధూళిపాళ్ల ఇటీవల వోగ్ మ్యాగజైన్ కోసం నాగ...

    Samantha : సమంత ఫోన్‌లో ‘మై లవ్’ కాంటాక్ట్: ఎవరిదంటే?

    Samantha : సమంత తన మొబైల్‌లో ‘మై లవ్’ పేరుతో ఒక కాంటాక్ట్...