శర్వానంద్ గతకొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన సినిమాలన్నీ ఘోరంగా దెబ్బకొట్టాయి. అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులను అలరించడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తాజాగా ” ఒకే ఒక జీవితం ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు శర్వా.
ఒకే ఒక జీవితం సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం శర్వానంద్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. చాలాకాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న శర్వాకు ఈ ఒకే ఒక జీవితం తప్పకుండా హిట్ ని ఇస్తుందన్న ధీమాతో ఉన్నాడు. ఈ చిత్రంలో అమల కీలక పాత్రలో నటించడం విశేషం.
ఆగస్టు నెల టాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార , దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం , నిఖిల్ కార్తికేయ 2 ఇలా మూడు చిత్రాలు బ్లాక్ బస్టర్ లుగా నిలిచాయి. అయితే ఆ తర్వాత మాత్రం వచ్చిన చిత్రాలు దారుణంగా దెబ్బకొట్టాయి. సెప్టెంబర్ నెల ప్రారంభమైంది కానీ మూడు చిత్రాలు అలా వచ్చాయి …… వచ్చినవి వచ్చినట్లుగానే పోయాయి. దాంతో ఒకే ఒక జీవితం చిత్రం హిట్ కొట్టి బాక్సాఫీస్ కు కాస్త ఊపిరి పీల్చుకునేలా చేస్తుందా ? అని బయ్యర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి శర్వాకు ఈ సినిమా హిట్ ని ఇస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.