Shocking comments on Pawan సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుడు ఏదొక విషయంలో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలిచే ముద్దుగుమ్మల్లో పూనమ్ కౌర్ ఒకరు.. ఈమె ఎప్పుడు తనకు సంబంధం లేని విషయాల గురించి స్పందిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది.. మరీ ముఖ్యంగా ఈమె ఏపీ రాజకీయాలపై స్పందిస్తూ చేసే కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి..
ఇదిలా ఉండగా తాజాగా ఈమె జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. పవన్ ఇటీవల వాలంటీర్లపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ ఈమె తాజాగా పోస్ట్ చేసింది. పవన్ చేసిన ఈ కామెంట్స్ పై వాలంటీర్లు కూడా సీరియస్ అయ్యారు.. ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ రోడెక్కారు..
పవన్ వారాహి యాత్ర సమయంలో ఏలూరులో నిర్వహించిన సభలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోవడానికి కారణం కూడా వాలంటీర్లే అంటూ పవన్ ఆరోపించగా ఈ వ్యాఖ్యలపై అంతా స్పందిస్తున్నారు. ఇక తాజాగా పూనమ్ కౌర్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఏపీలో మహిళా సమస్యలపై గొంతు చించుకునే వారు మహిళా రెజ్లర్ల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు.. అందరు దొంగ లీడర్లే అంటూ ఈమె చెప్పుకొచ్చింది. అలాగే తమకు రాజకీయ ప్రయోజనం ఉందన్నప్పుడే నకిలీ నాయకులూ రోడ్ల మీదకు వస్తున్నారు అంటూ ఇండైరెక్ట్ గా పవన్ మీద ఈమె చేసిన కామెంట్స్ తో మరోసారి పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురి అవుతుంది.
ReplyForward
|