
డార్లింగ్ ప్రభాస్ ఏమో వివాదరహితుడు , మనకెందుకు డార్లింగ్ అంటూ అలాంటి విషయాలకు దూరంగా ఉంటాడు కానీ అందుకు భిన్నంగా క్షణానికో వివాదంతో సహజీవనం చేసే రకం రాంగోపాల్ వర్మది. ప్రతీ రోజు ఎవరో ఒకరిని కెలకందే వర్మకు నిద్ర పట్టదు అలాంటి వర్మ ను ఏరికోరి తమ సినిమాలో పెట్టుకుంటున్నారు ప్రభాస్ అండ్ కో.
తాజాగా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ” రాజా డీలక్స్ ” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు మారుతి. ఇక ఓ గెస్ట్ అప్పియరెన్స్ వేషం ఉందట. దానికి రాంగోపాల్ వర్మ అయితే బాగుంటుందని భావించి వర్మను సంప్రదించడం జరిగిందట.
ఇంకేముంది వర్మ ఒప్పేసుకున్నాడు. అయితే ఆ పాత్ర గెస్ట్ అప్పియరెన్స్ అయినప్పటికీ ప్రేక్షకులకు షాకింగ్ అనే అంటున్నారు మేకర్స్. అయితే అది ఏంటి ? అన్నది మాత్రం రివీల్ చేయడం లేదు. ప్రభాస్ ఏకకాలంలో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆదిపురుష్ చిత్రాన్ని పూర్తి చేసాడు. ఇక ఇప్పుడు రాజా డీలక్స్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ప్రాజెక్ట్ – K , సలార్ షూటింగ్ లను కూడా ఇదే సమయంలో చేస్తున్నాడు.






