
డార్లింగ్ ప్రభాస్ తాజాగా నటిస్తున్న చిత్రం ” సలార్ ”. KGF 1 , KGF 2 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. ప్రభాస్ పై అలాగే ప్రభాస్ – శృతి హాసన్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
తాజాగా జరిగిన షెడ్యూల్ తో శృతి హాసన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యిందట. దాంతో శృతి హాసన్ కు ఘనంగా వీడ్కోలు ఇచ్చింది సలార్ చిత్ర బృందం. దాంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కు కృతఙ్ఞతలు తెలియజేస్తోంది ఈ అందాల భామ. సలార్ చిత్రంలో శృతి హాసన్ ఆధ్య పాత్రలో నటిస్తోంది. ప్రభాస్ ప్రేయసిగా నటిస్తోంది. అయితే శృతి హాసన్ కు పెద్దగా స్కోప్ ఉండే పాత్ర కాదని వినికిడి.
సాధారణంగా యాక్షన్ సినిమాల్లో హీరోయిన్ కు పాటలు , కొన్ని రొమాంటిక్ సీన్స్ అలాగే మరికొన్ని ఇతర సన్నివేశాలు మాత్రమే ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక డార్లింగ్ విషయానికి వస్తే …… బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది. దాంతో అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా చిత్రాలనే చేస్తున్నాడు. అయితే బాహుబలి తర్వాత వచ్చిన సాహో , రాధేశ్యామ్ చిత్రాలు ఘోరంగా నిరాశపరిచాయి. ఆదిపురుష్ టీజర్ తోనే భయపెట్టింది. మరి ఈ సలార్ ఏం చేస్తుందో చూడాలి.