
ప్రేమికుల దినోత్సవం రోజున తన ప్రియుడు సిద్దార్థ్ కు షాక్ ఇచ్చింది హీరోయిన్ అదితి రావు హైదరీ. గతకొంత కాలంగా అదితి – సిద్దార్థ్ లు ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేమికుల రోజున ఈ ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేసుకోవలసింది పోయి మరొక హీరోకు ప్రపోజ్ చేసింది. దాంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇంతకీ అదితి ఏ హీరోకు ప్రపోజ్ చేసిందో తెలుసా…….. వెటరన్ స్టార్ ధర్మేంద్ర కు.
ఒకప్పుడు రొమాంటిక్ హీరో ఎవరయ్యా అంటే టక్కున చెప్పే పేర్లలో ధర్మేంద్ర పేరు కూడా ఒకటి. తాజాగా ధర్మేంద్ర కు ఎర్ర గులాబీ ఇస్తూ తన ప్రేమను వ్యక్తం చేసింది అదితి రావు హైదరీ. మోస్ట్ హ్యాండ్సమ్ అంటూ పోస్ట్ చేసింది.
అయితే సిద్దార్థ్ ను ఉడికించడానికి అదితి రావు హైదరీ ఇలా చేసి ఉండొచ్చు అని భావిస్తున్నారు నెటిజన్లు. ఈరోజు ప్రేమికుల దినోత్సవం కాబట్టి సరదాగా ఇలా ఆటపట్టించిదన్న మాట.