దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న అవార్డుల సంస్థ ” సైమా ”. గత పదేళ్లుగా భారీ ఎత్తున ఖర్చుకు వెనుకాడకుండా సైమా అవార్డులను అందజేస్తోంది. ఇక కరోనా కారణంగా గతకొంత కాలంగా సైమా సందడి తగ్గింది. ఇక ఇపుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది పెద్ద ఎత్తున సైమా అవార్డులను అందించడానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం పలు చిత్రాలను సైమా నామినేట్ చేసింది. ఇక ఈ సినిమాల నుండి పలు అవార్డులు పోటీ పడనున్నాయి.
ఇంతకీ సైమా అవార్డుల జాబితాలో చేర్చిన చిత్రాల జాబితా ఎలా ఉందో చూద్దామా !
అఖండ – 10 కేటగిరీలలో నామినేట్ అయ్యింది.
పుష్ప – 12 కేటగిరీలలో నామినేట్ అయ్యింది.
జాతి రత్నాలు – 8 కేటగిరీలలో నామినేట్ అయ్యింది.
ఉప్పెన – 8 కేటగిరీ లలో నామినేట్ అయ్యింది.
అలాగే లవ్ స్టోరీ చిత్రం కూడా నామినేట్ అయ్యింది. మొత్తంగా తెలుగు నుండి ఈ అయిదు చిత్రాలు పలు అవార్డులకు పోటీ పడనున్నాయి. మరి వీటిలో ఎక్కువగా అవార్డులను గెలుచుకునే చిత్రం ఏదో చూడాలి.
Breaking News