
సింగర్ గీతా మాధురి భర్త నందు కు గాయాలయ్యాయి. కుడి కాలు ఫ్రాక్చర్ కావడంతో కొద్దీ రోజులుగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాలుకు సిమెంట్ పట్టీ వేశారు. సిమెంట్ పట్టీ అంటే మూడు వారాల నుండి 6 వారాల వరకు ఉంచాల్సిందే. అయితే నందుకు ఎప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అనే విషయాన్ని తెలపలేదు. కానీ కాలు ఫ్రాక్చర్ అయినప్పటికీ ఓ సినిమాకు డబ్బింగ్ చెప్పడానికి ఆ గాయంతోనే డబ్బింగ్ థియేటర్ కు వచ్చాడు. ఈ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇంకేముంది ఆ ఫోటో వైరల్ గా మారింది.
గాయాలు అయినప్పటికీ డబ్బింగ్ చెప్పడానికి స్టూడియోకు వచ్చాడని తెలుసుకొని నందును అభినందిస్తున్నారు నెటిజన్లు. గాయని గీతా మాధురి – నందు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సింగర్ గా గీతా మాధురి అదర గొడుతుండగా నందు మాత్రం నటుడిగా సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు……. పోరాటం చేస్తూనే ఉన్నాడు.