గాయని , నటి మంగ్లీ పై కర్ణాటకలో దాడి జరిగినట్లుగా సోషల్ మీడియాలో అదేపనిగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారం మరీ ఎక్కువ కావడంతో తనపై ఎలాంటి దాడులు జరగలేదని , అలా జరిగినట్లుగా అబద్దపు ప్రచారం జరుగుతోందని ఖండించింది మంగ్లీ. ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇటీవల కర్ణాటకలోని బళ్లారికి ఓ కార్యక్రమం కోసం వెళ్ళింది. అక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. అయితే లాఠీ ఛార్జ్ తో కొంతమంది యువకులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఆ సమయంలో కొంతమంది పట్ల దురుసుగా ప్రవర్తించారు ……. అలాగే తోపులాట జరిగింది. ఇక సింగర్ మంగ్లీని దగ్గరగా చూడాలని , ఫోటోలు దిగాలని వెంటపడ్డారు. దాన్ని దాడిగా కొంతమంది అభివర్ణించి సోషల్ మీడియాలో ప్రచారం చేసారు అంతేకాని అసలు నిజం అది కాదని తెలుస్తోంది.
సింగర్ మంగ్లీ తెలుగులో పలు చిత్రాలలో పాటలు పాడిన విషయం తెలిసిందే. మంగ్లీ పాడిన పాటలన్ని కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఆమె దశ తిరిగింది. సింగర్ గానే కాకుండా కొన్ని చిత్రాల్లో నటించింది కూడా. ఇక ఇప్పుడేమో నటిగా కూడా సత్తా చాటాలని చూస్తోంది.