
గుజరాత్ సింగర్ వైశాలి బల్సారా తన కారులోనే అనుమానాస్పదంగా మృతి చెందింది. దాంతో రంగప్రవేశం చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. టీవీ షోలలో బాగా ఫేమస్ అయిన సింగర్ వైశాలి బల్సారా. ఆమె భర్త కూడా మంచి సింగర్ కావడం విశేషం. అయితే గుజరాత్ లోని పార్ నది ఒడ్డున కారు ఆగివుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
దాంతో పోలీసులు ఆ కారు తెరిచి చూడగా కారు వెనుక సీట్లో వైశాలి బల్సారా మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు. వెంటనే కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. అయితే అంతకుముందే శనివారం రోజున అర్ధరాత్రి 2 గంటలకు తన భార్య కనిపించడం లేదని వైశాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దాంతో పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.