
చిత్రపరిశ్రమలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. దర్శకులు సాగర్ , కళాతపస్వి విశ్వనాథ్ మరణాలను మర్చిపోలేక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ గాయని వాణీ జయరాం ఈరోజు అనారోగ్యంతో మరణించారు. 77 సంవత్సరాల వాణీ జయరాం మొత్తంగా అన్ని భాషల్లో కలిపి 10 వేలకు పైగా పాటలు పాడారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డ్ ప్రకటించిన నేపథ్యంలో ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరిసింది. అయితే ఆ సంతోషం పట్టుమని వారం రోజులు గడవకముందే చెన్నైలోని ఇంట్లో తలకు బలమైన గాయం కావడంమరణించినట్లు తెలుస్తోంది.