ప్రముఖ నేపథ్య గాయకుడు యశస్వి తనపై వస్తున్న వివాదాస్పద అంశంపై ఎట్టకేలకు స్పందించాడు. అది అనుకోకుండా జరిగిన పొరపాటు అంటూ ఒక్క ముక్కలో తేల్చాడు. అయితే సుదీర్ఘంగా మాత్రం వివరణ ఇచ్చాడు. తన కుటుంబ సభ్యులు కాకినాడ లోని సాధ్య అనే స్వచ్ఛంద సంస్థ కు తమకు తోచినంత సహాయం చేసారని , వాళ్ళు నవ సేన అనే స్వచ్ఛంద సంస్థకు సహాయం అందించారని తెలిసింది. దాంతో నేను అనవసరంగా వాళ్ళ పేరు చెప్పానని నేను చేసిన పొరపాటు ఇదేనని అంటున్నాడు.
అంతేకాదు నా పుట్టినరోజున నా అభిమానులు నవసేన అనే స్వచ్ఛంద సంస్థ లో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారని , అలాగే పిల్లల కోసం కొంత ఆర్ధిక సహాయం కూడా చేసారని…… అలాగే ఆ పిల్లలు నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారని వివరించాడు. ఇది నేను పాల్గొన్న ఓ షోలో ప్రోమో కోసం వాడుకున్నాం. అయితే ఈ ప్రోమో ను చూసిన ఫరా నాకు ఫోన్ చేసి మా సంస్థ పేరు ఎందుకు వాడారు……. 9 నెలల పాటు మా పిల్లలను దత్తత తీసుకోవాల్సిందే అంటూ ఒత్తిడి చేసారని ….. నావల్ల ఎంత వరకు వీలు అవుతుందో అంత వరకు మాత్రమే చేయగలను కానీ 9 నెలల పాటు దత్తత తీసుకోవాల్సిందే అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నాడు యశస్వి.
అయితే ఈ వివాదంలో ఎక్కువగా నష్టపోయింది యశస్వి అనే చెప్పాలి. సహాయం చేయకుండా దాదాపు 60 మందిని ఆదుకున్నానని ఓ పాపులర్ షోలో చెప్పడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక యశస్వి కూడా చేసింది చాలా చాలా తప్పు అనే చెప్పాలి. పైగా పొంతన లేని విషయాలు చెబుతూ తన తప్పు పెద్దగా లేదు పొరపాటున చేసాను అని అంటున్నాడు. మొత్తానికి ఈ వ్యవహారంలో యశస్వి దే తప్పు అని తేలిపోయింది.