సీతారామం చిత్రంతో సంచలన విజయం సాధించిన హను రాఘవపూడి తన తదుపరి చిత్రాన్ని నానితో చేయాలనుకున్నాడు. అయితే నాని హను రాఘవపూడిని రిజెక్ట్ చేసాడు. కట్ చేస్తే హీరో రాంచరణ్ ను కలిసాడు కానీ చరణ్ ఖాళీగా లేడుగా …… ఇప్పటికే పలు చిత్రాలను ఒప్పుకొని బిజీగా ఉన్నాడు దాంతో హనును రిజెక్ట్ చేసాడు. కట్ చేస్తే ఇదే కథ తీసుకుని తమిళ స్టార్ హీరో సూర్యను కలువగా కథ విన్న వెంటనే మరో మాట లేకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దాంతో హను రాఘవపూడి తన తదుపరి చిత్రాన్ని సీతారామం డైరెక్టర్ తో చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారికంగా ఈ కాంబినేషన్ లో సినిమాను ప్రకటించనున్నారట. ఇక ఈ సినిమాను నిర్మించేది ఎవరో తెలుసా ……. మైత్రి మూవీ మేకర్స్. గతకొంత కాలంగా వరుసగా స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తోంది మైత్రి మూవీ మేకర్స్.
హను రాఘవపూడి కెరీర్ లో హిట్స్ కంటే ప్లాప్ లే ఎక్కువ దాంతో ఈ దర్శకుడితో సినిమాలు చేయాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు హీరోలు. అయితే సీతారామం చిత్రాన్ని మాత్రం అద్భుతంగా తీసి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. ఆ సినిమాతో మ్యాజిక్ చేసాడు దాంతో హను రాఘవపూడి కి స్టార్ స్టేటస్ దక్కింది. అయితే చరణ్ , నాని తిరస్కరించిన కథను హీరో సూర్య నమ్మడం డేట్స్ ఇవ్వడం మాత్రం గొప్ప విషయమే !.