మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ” సీతారామం ”. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ – స్వప్న నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5 న విడుదలైన విషయం తెలిసిందే. యుద్ధంతో రాసిన ప్రేమకథగా వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దాంతో 50 కోట్ల క్లబ్ లో చేరింది.
దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ లు జంటగా నటించగా ఈ జంటని ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఈ ప్రేమకథా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడంతో వసూళ్ల వర్షం కురుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే ఓవర్ సీస్ లో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. 30 కోట్లతో నిర్మించిన ఈ చిత్రానికి అప్పుడే 50 కోట్ల వసూళ్లు వచ్చాయి.
ఇక శాటిలైట్ , డిజిటల్ , ఓటీటీ , డబ్బింగ్ రైట్స్ రూపంలో భారీ మొత్తంలోనే డబ్బులు రానున్నాయి. చాలాకాలం తర్వాత వైజయంతి మూవీస్ కు బ్లాక్ బస్టర్ లభించింది ఈ సీతారామం రూపంలో. ఇక దర్శకులు హను రాఘవపూడికి కూడా సాలిడ్ బ్లాక్ బస్టర్ లభించింది. గతకొంత కాలంగా కెరీర్ డోలాయమానంగా తయారయ్యింది వరుస ప్లాప్ చిత్రాలతో. సరిగ్గా అలాంటి సమయంలోనే సీతారామం చిత్రంతో సంచలనం సృష్టించాడు.
Breaking News