దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం చిత్రం బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఆగస్టు 5 న విడుదలైన ఈ చిత్రం భారీ వసూళ్ళని సాధిస్తూ భారీ విజయం సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రంలో మొదట హీరోగా నటించే అవకాశం ఎవరికి వచ్చిందో తెలుసా …… నాని , విజయ్ దేవరకొండ , రామ్ లకు.
అవును …….. హీరో నానికి మొదట ఈ అవకాశం వచ్చింది. అయితే కథ విన్నాకా నాని నో చెప్పాడు దాంతో విజయ్ దేవరకొండని టచ్ చేశారట. ఇక్కడ కూడా సేమ్ డైలాగ్ దాంతో హీరో రామ్ దగ్గరకు వెళ్ళింది ప్రాజెక్ట్ . ఇక రామ్ కూడా మిగతా వాళ్ళ లాగే రిజెక్ట్ చేసాడు. దాంతో ఇక తెలుగులో మరో హీరోని టచ్ చేయకుండా మలయాళ హీరో అయిన దుల్కర్ సల్మాన్ ని అడిగారు. కథ విన్నాడు …… ఓకే చేసాడు. కట్ చేస్తే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది సీతారామం.
దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసింది. దాంతో ఆ ఆనందాన్ని వర్ణించలేక ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు దుల్కర్. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ వంటి భారీ నిర్మాణ సంస్థ నిర్మించింది. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన చిత్రాలు ఘోర పరాజయం పొందడంతో కొంతమంది హీరోలు ఈ దర్శకుడు చెప్పే కథ వినడం మానేశారు. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు హను రాఘవపూడికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
Breaking News
SITA RAMAM- NANI- VIJAY DEVARAKONDA- RAM:సీతారామంచిత్రాన్ని మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే !
Date: