
సీతారామం ఆగస్టు 5 న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. 30 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం ఓవరాల్ గా 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. థియేట్రికల్ గా 80 కోట్ల గ్రాస్ అందుకుంది ఈ చిత్రం. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కూడా భారీ మొత్తమే వచ్చింది.
శాటిలైట్ , డిజిటల్ , ఓటీటీ రైట్స్ రూపంలో 30 కోట్లకు పైగా వచ్చాయట దాంతో ఈ సినిమాను తీసిన వాళ్లకు అలాగే కొన్న వాళ్లకు కూడా భారీగా లాభాలు వచ్చాయి. హను రాఘవపూడికి ఈ సినిమా మంచి బ్రేక్ నిచ్చింది. హను చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండటంతో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకుండాపోయాయి. అయితే రిలీజ్ అయ్యాక మాత్రం ప్రేక్షకులను విశేషంగా అలరించడంతో హను రాఘవపూడితో పాటుగా దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ తదితరులకు కెరీర్ లో మరిచిపోలేని చిత్రంగా నిలిచింది.
ఇక ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 9 న స్ట్రీమింగ్ కి వస్తోంది. థియేటర్ లలో సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఓటీటీ లో కూడా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ , స్వప్న ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.