హైదరాబాద్ మహానగరంలోని కొండాపూర్ లో భారతదేశంలోనే అతిపెద్ద లంచ్ ప్లేట్ ని సోనూ సూద్ ప్రారంభించాడు. జిస్మత్ జైల్ మండి పేరుతో ఈ అతిపెద్ద లంచ్ ప్లేట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి సోనూ సూద్ తో పాటుగా నటి , బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ కూడా పాల్గొంది. ఇక సోనూ సూద్ రాకతో కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది…… ఎందుకంటే సోనూ సూద్ వస్తున్నాడని తెలుసుకున్న జనాలు పెద్ద ఎత్తున జిస్మత్ జైల్ మండికి తరలివచ్చారు.
అలాగే యువత కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాంతో ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసులు పలు చర్యలు చేపట్టారు. సోనూ సూద్ ను చూడటానికి యువత ఉత్సాహం ప్రదర్శించారు. సోనూ సూద్ చేతుల మీదుగా తమ బిజినెస్ స్టార్ట్ కావడం సంతోషంగా ఉందన్నారు జిస్మత్ నిర్వాహకులు.