
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం విడుదలై నిన్నటితో రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ
నేపథ్యంలో వకీల్ సాబ్ 2 కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం తెలిసింది. ఇది తెలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరు తెగ ఖుషీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన వకీల్ సాబ్ మూవీ అమితాబ్ బచ్చన్ నటించిన రీమేక్ చిత్రంగా వచ్చింది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వంవహించారు. ఈ క్రమంలో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ 2 త్వరలో ఉంటుందని అందరనీ ఆశ్చర్యపరుస్తు వెల్లడించారు. సీక్వెల్ కోసం స్క్రిప్ట్ వర్క్
జరుగుతోందని ఆయన తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం వకీల్ సాబ్ నిన్నటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా
థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్‌లో చాటింగ్ నిర్వహించారు. ఆ చర్చలో వేణు శ్రీరామ్ కూడా చేరారు.
సంభాషణలో భాగంగా వకీల్ సాబ్ ఖచ్చితంగా తిరిగి విడుదల చేయబడుతుందని అన్నారు. దీంతోపాటు వకీల్ సాబ్ 2 కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీర మల్లు, వినోదాయ సీతమ్ రీమేక్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలు పూర్తైన
తర్వాత వకీల్ సాబ్ 2ను తెరెకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎప్పుడనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఎన్నికలు పూర్తైన తర్వాత చిత్రీకరిస్తారా లేదా ఎన్నికలకు ముందే
ఈ చిత్రం నిర్మిస్తారా అనేది తెలియాల్సి ఉంది






