తెలుగు ఇండస్ట్రీలో కన్నడ హీరోయిన్లు ఎంతో మంది మంచి సక్సెస్ సాధించి నెంబర్ వన్ హీరోయిన్లుగా చెలామణి అయ్యారు. కన్నడ హీరోయిన్ సౌందర్య తర్వాత ఆ స్థాయిలో మంచి పేరు సంపాదించుకుంది నటి ప్రేమ. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ధర్మచక్రం చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమై.. ఆతర్వాత దేవీ మూవీతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన ప్రేమ … స్టార్ హీరోయిన్ ఉండగానే… పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు. ఆ మధ్య సెకండ్ ఇన్సింగ్స్ ను ప్రారంభించిన ప్రేమ… ఓ ఇంటర్వ్యూలో తన సినీ జర్నీతో పాటు ఎన్నో విషయాలను షేర్ చేసుకుని ఎమోషనల్ అయ్యారు.
సౌందర్య.. ఈ లోకాన్ని విడిచి ఎన్నో ఏళ్లు అయిపోయినా సినీ ప్రియులు గుండెల్లో మాత్రం అలానే ఉండిపోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న సౌందర్య అతి చిన్న వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో తనువు చాలించడం అందరినీ ఎంతలా కలచివేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రీసెంట్ గా సౌందర్య మృతిని తల్చుకుని ప్రేమ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.సౌందర్య చనిపోయిన రోజు.. ఇంతేనా జీవితం అనిపించిందని భావోద్వేగానికి గురయ్యారు. చివరి చూపు కోసం వాళ్ల ఇంటికి వెళ్లాను. సౌందర్య, ఆమె సోదరుడు మృతదేహాలను ఓ బాక్స్‌లో పెట్టి ఉంచారని… గుర్తించలేని విధంగా సౌందర్య డెడ్ బాడీ ఉందని… ఫేస్ కూడా లేదని.. సౌందర్య చేతికి పెట్టుకున్న వాచ్‌ను బట్టి అది సౌందర్య డెడ్‌బాడీ అని గుర్తించినట్లు ఎమోషనల్ అయ్యారు.
సౌందర్యను ఎప్పటికీ మరచిపోలేనని తన రూపం ఇప్పటికీ అలానే నా మైండ్ లో గుర్తుండిపోయిందంటూ చెప్పుకొచ్చారు. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది కర్మ, హార్డ్ వర్క్ తప్ప ఏమీ లేదని ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమాల గురించి చెబుతూ దర్శకుడు కోడి రామకృష్ణ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన `అరుంధతి` సినిమాను కోడి రామకృష్ణ మొదట ప్రేమను సంప్రదించారట. డేట్స్ ఖాళీగా లేకపోవడంతో జేజమ్మ పాత్రను ప్రేమ రిజెక్ట్ చేసిందట.అయితే ఆ రోల్ చేయనందకు తనకు బాధగా ఏమీ లేదని.. ఆ పాత్ర తనకు రాసిపెట్టి లేదని ప్రేమ చెప్పుకొచ్చింది