సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ పై ఫైర్ అవుతున్నారు మెగా అభిమానులు అలాగే నెటిజన్లు. వీళ్లకు తమన్ పై ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా…… గాడ్ ఫాదర్ చిత్రంలో ” టార్ మార్ ” అనే పాటకు కాపీ ట్యూన్ ఇవ్వడమే. ఆమధ్య రవితేజ నటించిన క్రాక్ సినిమాలోని దండనకర అనే పాట ట్యూన్ యాజిటీజ్ గా చిరు గాడ్ ఫాదర్ పాటకు దింపేశాడు. ట్యూన్ బాగుంది కానీ మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా సల్మాన్ ఖాన్ కూడా ఈ పాటలో నటిస్తున్నాడు దాంతో ఈ పాటపై భారీ అంచనాలు ఉంటాయి. అయితే కాపీ ట్యూన్ ఇవ్వడం వల్ల మెగా ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు తమన్ ని.
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు పని చేస్తున్నప్పుడు ఆ మాత్రం చూసుకోవా ? కాపీ ట్యూన్ ఎలా ఇస్తావు ? ఎప్పుడూ ఇదేనా ? అంటూ ఆడేసుకొంటున్నారు సోషల్ మీడియాలో. గతంలో కూడా తమన్ పలుమార్లు తమన్ కాపీ ట్యూన్ లను ఇచ్చాడు. దాంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఆ ట్యూన్ ఎక్కడి నుండి లేపేసాడో ఉదహరిస్తూ ఆ కాపీ ట్యూన్ ని అలాగే ఇప్పటి ట్యూన్ లను మిక్స్ చేసి పెట్టేవాళ్ళు. నెటిజన్ల ట్రోల్ పై ఇంకా తమన్ స్పందించలేదు. అతడి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.