బాలయ్య అన్ స్టాపబుల్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ డిసెంబర్ లోనే చిత్రీకరణ జరుపుకుంది. అయితే ఇప్పటి వరకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కి రాలేదు. ఇటీవలే ఫస్ట్ గ్లిమ్ప్స్ రిలీజ్ చేయగా దానికి అనూహ్య స్పందన వచ్చింది. అయితే స్ట్రీమింగ్ డేట్ మాత్రం ప్రకటించలేదు దాంతో అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. కట్ చేస్తే ఫిబ్రవరి 3 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కు వస్తున్నట్లుగా తెలుస్తోంది.
త్వరలోనే ఆహా టీమ్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చేలా కనబడుతోంది. బాలయ్య అన్ స్టాపబుల్ షో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఇదే నెంబర్ వన్ షోగా రికార్డులను సృష్టిస్తోంది. బాహుబలి ప్రభాస్ ఎపిసోడ్ తో మరిన్ని అంచనాలు పెరగగా ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో అన్ స్టాపబుల్ మరింత బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం. ఈ ఎపిసోడ్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ రాజకీయాల గురించి , రెండు చోట్లా పోటీ చేస్తే అక్కడ వచ్చిన ఓటమి గురించి అలాగే మూడు పెళ్లిళ్ల గురించి కూడా బాలయ్య ప్రశ్నించినట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ వాటికి ఎలాంటి సమాధానాలు ఇచ్చాడన్నది ఎపిసోడ్ లోనే చూడాల్సి ఉంటుంది.