
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటి జమున మరణించి శోక సంద్రంలో మునిగింది. ఇక ఇదే సమయంలో ఫైట్ మాస్టర్ జూడో రత్నం ( 92) అనారోగ్యంతో మరణించారు. తెలుగు , తమిళ , హిందీ భాషల్లో మొత్తంగా 1500 కు పైగా చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పని చేసారు జూడో రత్నం. రజనీకాంత్ , కమల్ హాసన్ , విజయ్ కాంత్ , చిరంజీవి , బాలకృష్ణ తదితర స్టార్ హీరోల చిత్రాలకు ఫైట్ మాస్టర్ గా పని చేసారు. 70 – 90 వ దశకం మధ్యలో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నారు జూడో రత్నం. అనారోగ్యంతో జనవరి 26 న మరణించారు.