UBlood app వంటి గొప్ప యాప్ ను సృష్టించిన డాక్టర్ జై యలమంచిలి అభినందనీయుడని , గొప్ప సంకల్పానికి శ్రీకారం చుట్టారని ప్రశంసల వర్షం కురిపించారు సీనియర్ నటుడు శుభలేఖ సుధాకర్. 1982 లో విడుదలైన శుభలేఖ చిత్రం ద్వారా నటుడిగా పరిచయమయ్యారు సుధాకర్. శుభలేఖ అనేది ఆయన ఇంటి పేరు కాదు …… ఇంటి పేరు సూరావఝల. అయితే శుభలేఖ అనే చిత్రంతో నటుడిగా పరిచయం కావడంతో అదే ఆయన ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. 62 సంవత్సరాల వయసున్న శుభలేఖ సుధాకర్ నాలుగు దశాబ్దాలకు పైగా నటుడిగా కొనసాగుతున్నారు. హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , కమెడియన్ గా ఇన్నేళ్ల కెరీర్ లో విభిన్న పాత్రలను పోషించారు…… ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
అయితే కొన్నాళ్ల పాటు సినిమాలకు కాస్త దూరంగా ఉన్న శుభలేఖ సుధాకర్ మళ్లీ నటజీవితంలో బిజీగా మారారు. పలు చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషిస్తూ తనదైన ముద్ర వేస్తున్నారు. తన అనుభవంతో ఆయా పాత్రలకు మరింత వన్నె తెస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతమైన పాత్రలతో రాణిస్తున్న శుభలేఖ సుధాకర్ తాజాగా JSW& Jaiswaraajya.tv యూట్యూబ్ ఛానల్స్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తన అనుభవాలను పంచుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి నటీనటులతోనే కాకుండా ఈతరం హీరోలు పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ , మహేష్ బాబు , చరణ్ తదితరుల గురించి తన అనుభవాలతో పాటుగా అభిప్రాయాలను పంచుకున్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో డాక్టర్ జై యలమంచిలి గొప్ప సంకల్పంతో సృష్టించిన UBlood app గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎవరికి , ఏ క్షణాన రక్తం అవసరం పడుతుందో ఎవరికీ తెలియదు. అది ఆ భగవంతుడు ఒక్కడికే తెలిసేది…… ఇదంతా ఆ భగవంతుడు లీల. అందుకే ప్రతీ ఒక్కరూ యు బ్లడ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని, తద్వారా అవసరమైన సమయంలో రక్తదాతల నుండి రక్తాన్ని స్వీకరించే గొప్ప సౌలభ్యం ఉన్న యాప్ ఇది ప్రజలందరి దగ్గర ఉండాల్సిన యాప్ అంటూ దీనిని సృష్టించిన డాక్టర్ జై యలమంచిలిని అభినందించారు. అలాగే JSW&jaiswaraajya.tv ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు.