16.3 C
India
Sunday, December 7, 2025
More

    హంట్ రివ్యూ

    Date:

    హంట్ రివ్యూ
    హంట్ రివ్యూ

    నటీనటులు : సుధీర్ బాబు , శ్రీకాంత్ , భరత్
    సంగీతం : జిబ్రాన్
    నిర్మాత : వి. ఆనంద్ ప్రసాద్
    దర్శకత్వం : మహేష్ సూరపనేని
    రిలీజ్ డేట్ : 26 జనవరి 2023
    రేటింగ్ : 3/ 5

    సుధీర్ బాబు హీరోగా మహేష్ సూరపనేని దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మించిన యాక్షన్ చిత్రం ” హంట్ ”. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే.

    కథ :

    పోలీస్ ఆఫీసర్ ఆర్యన్ దేవ్ ( భరత్ ) ని అత్యంత దారుణంగా హత్య చేస్తారు దుండగులు. దాంతో ఆ కేసు విచారణకు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ACP అర్జున్ ప్రసాద్ ( సుధీర్ బాబు ) ను నియమిస్తుంది పోలీస్ డిపార్ట్ మెంట్. కేసు విచారణ చేస్తున్న సమయంలో అర్జున్ ప్రసాద్ యాక్సిడెంట్ కు గురౌతాడు. ఆ యాక్సిడెంట్ వల్ల గతం మర్చిపోతాడు. గతం మర్చిపోయిన అర్జున్ ప్రసాద్ మళ్ళీ మామూలు మనిషి అయ్యాడా ? హత్య కేసు చేధించాడా ? అసలు ఆర్యన్ ను చంపింది ఎవరు ?  తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

    హైలెట్స్ :

    సుధీర్ బాబు
    శ్రీకాంత్
    యాక్షన్ ఎలిమెంట్స్
    క్లైమాక్స్

    డ్రా బ్యాక్స్ :

    స్క్రీన్ ప్లే

    నటీనటుల ప్రతిభ :

    పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుధీర్ బాబు ఇరగదీసాడు. అద్భుతమైన యాక్షన్ సీన్స్ తో అలరించాడు. అలాగే గతం మర్చిపోయిన సమయంలో తనని తాను గుర్తు తెచ్చుకోవడానికి చేసే సన్నివేశాల్లో బాగానే జీవించాడు. ఇక సీనియర్ నటుడు శ్రీకాంత్ తన అనుభవంతో మరోసారి తన పాత్రను మెప్పించాడు. భరత్ కు అంతగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంత వరకు బాగానే చేసాడు. కబీర్ సింగ్ , రవివర్మ , మైమ్ గోపి తదితరులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు.

    సాంకేతిక వర్గం :

    భవ్య క్రియేషన్స్ అధినేత ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు. విజువల్స్ బాగున్నాయి ….. యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. సంగీతం , నేపథ్య సంగీతం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక దర్శకుడు మహేష్ క్రైం డ్రామా ను బాగానే రాసుకున్నాడు కానీ స్క్రీన్ ప్లే లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరో లెవల్ లో ఉండేది.

    ఓవరాల్ గా :

    అక్కడక్కడా మెప్పించే చిత్రం మాత్రమే ! 

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related