
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ” వీర సింహా రెడ్డి ”. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి తాజాగా ” సుగుణ సుందరి ” అనే వీడియో సాంగ్ రిలీజ్ చేసారు. 4 నిమిషాలకు పైగా ఉన్న ఈ వీడియో సాంగ్ బాలయ్య అభిమానులను మాత్రమే కాదు మాస్ సాంగ్ కోరుకునే ప్రేక్షకులను విశేషంగా అలరించేలా ఉంది.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఫారిన్ లో అందమైన లొకేషన్ లలో ఈ పాటను చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో బాలయ్య అయితే రెచ్చిపోయాడు. శృతి హాసన్ తో పోటీ పడి మరీ డ్యాన్స్ చేసాడు. కొన్ని స్టెప్పులు థియేటర్ లలో కేకలు పెట్టించడం ఖాయం. ఈ వయసులో కూడా బాలయ్య కుర్ర హీరోయిన్ తో పోటీ పడి డ్యాన్స్ చేయడం విశేషం.
వీర సింహా రెడ్డి చిత్రాన్ని 2023 జనవరి 12 న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపించనున్నాడు. ఇక కీలక పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ నటిస్తున్నారు. ఇప్పటికే జై బాలయ్య జై జై బాలయ్య అనే పాట మొదటగా విడుదల కాగా ఆ పాట బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో పాట కూడా సూపర్ హిట్ అనే చెప్పాలి.