సుహాస్ హీరోగా నటించిన చిత్రం ” రైటర్ పద్మభూషణ్ ”. షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆశిష్ విద్యార్ధి , రోహిణి టీనా శిల్పారాజ్ తదితరులు నటించారు. ఫిబ్రవరి 3 న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు దాంతో నిర్మాతకు అలాగే బయ్యర్లకు లాభాలు వచ్చి పడ్డాయి. ఇక సుహాస్ హీరోగా మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నాడు రైటర్ పద్మభూషణ్ చిత్రంతో.
బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ 5 లో ఉగాది కానుకగా మార్చి 22 న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. జీ 5 వాళ్ళు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఓటీటీ రైట్స్ మాత్రం జీ 5 భారీ సొమ్ము చెల్లించి హక్కులు పొందినట్లు తెలుస్తోంది.
కలర్ ఫోటో చిత్రంతో హీరోగా మారి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సుహాస్ ఆ తర్వాత పలు చిత్రాల్లో కమెడియన్ గా నటించాడు. అయితే హీరోగా మరోసారి రైటర్ పద్మభూషణ్ చిత్రంతో విజయం సాధించడంతో అతడికి మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాడట సుహాస్.