
అల్లు అర్జున్ హీరోగా నటించిన సంచలన చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పార్ట్ 2 కాగా దానికి సీక్వెల్ గా పుష్ప – 3 కూడా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పుష్ప భారీ బ్లాక్ బస్టర్ కావడంతో ప్రస్తుతం పుష్ప 2 చిత్రీకరిస్తున్నారు. అయితే పుష్ప 3 కూడా తీయాలనే ఆలోచన వచ్చిందట సుకుమార్ కు.
దాంతో పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 కి సంబందించిన షాకింగ్ అయ్యే ఒక సన్నివేశాన్ని రివీల్ చేయనున్నారట దాంతో అది పార్ట్ 3 కి ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఇది నిజమా ? లేదా ? అన్నది సుకుమార్ వెల్లడించాలి కానీ వినబడుతున్న కథనం ప్రకారం అయితే ఇది నిజమే అని తెలుస్తోంది.
సుకుమార్ అంటేనే ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ అనే విషయం తెలిసిందే. దాంతో పుష్ప 2 లో కూడా భారీగా పేలిపోయే ఐటెం సాంగ్ ప్లాన్ చేసాడట. పుష్ప లో సమంత ఐటెం సాంగ్ ” ఊ అంటావా మావా ఊఊ అంటావా ” అనే పాట ఎంతగా పేలిందో అందరికీ తెలిసిందే. అదే రేంజ్ లో పుష్ప 2 లో కూడా ఐటెం సాంగ్ ఉండనుందట.