80- 90 వ దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హీరో సుమన్ ఆవేశంతో రగిలిపోతున్నాడు. కామ్ గా ఉండే సుమన్ ఇంతగా ఆవేశంతో రగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా …… సుమన్ తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడంటూ ఉత్తరాదికి చెందిన యూట్యూబ్ ఛానల్స్ లో ఏకంగా ప్రోగ్రామ్స్ చేయడమే.
తాను హాయిగా ఆరోగ్యంగా ఉంటె చనిపోయానంటూ ప్రోగ్రాం ఎలా చేస్తారు అంటూ ఆవేశంతో ఊగిపోతున్నాడు సుమన్. తనని ఇంతగా అవమానించిన ఆ యూట్యూబ్ ఛానల్స్ ని క్షమించేది లేదని , తప్పకుండా లీగల్ గా వాళ్లపై చర్యలు తీసుకుంటానని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.
ఇటీవల పలు యూట్యూబ్ ఛానల్స్ తమ లైక్స్ కోసం , వ్యూస్ కోసం బాగున్న సెలబ్రిటీలను చనిపోయాడంటూ వార్తలు ప్రసారం చేస్తున్నాయి. అలాంటి ఛానల్స్ చాలానే ఉన్నాయి. దాంతో ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ వల్ల పలువురు సెలబ్రిటీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మానసికంగా కూడా నలిగి పోతున్నారు.
Breaking News