
దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఒక సినిమాను చేయాలని చాలా గట్టి ప్రయత్నాలు చేసాడు. అయితే ఎంత బలంగా ఆ సినిమా చేయాలని అనుకున్నాడో అంతే బలంగా ఆ సినిమాను పక్కన పెట్టాడు. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా…….. ఛత్రపతి శివాజీ. అవును మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ అఖండ భారతం కోసం చాలా కష్టపడ్డాడు. ఎన్నో విజయాలను సాధించాడు.
భారతజాతి చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే ముస్లిం రాజులను ఎదురించి పోరాడిన యోధుడు కావడంతో సినిమాలో తప్పకుండా ముస్లిం ల ప్రస్తావన ఉండటంతో పాటుగా అప్పట్లో ముస్లిం పాలకులు హిందువులపై ఎలాంటి దారుణాలు చేశారో చూపించాల్సి ఉంటుంది.
ముస్లింల అరాచకాలను చూపిస్తే తప్పకుండా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో ఛత్రపతి శివాజీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నప్పటికీ , తన మనసుని చంపుకొని ఆ సినిమాను పక్కన పెట్టాడు. అయితే తన మనసులో ఛత్రపతి శివాజీ బలంగా నాటుకుపోయాడు కాబట్టి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన నెంబర్ వన్ చిత్రంలో మాత్రం ఓ పాటలో ఛత్రపతి శివాజీ గెటప్ లో కనిపించారు కృష్ణ. ఆ గెటప్ లో అభిమానులను విశేషంగా అలరించాడు కృష్ణ.