
అశేష అభిమానుల అశ్రునయనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల మధ్య ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి అంత్యక్రియల ఘట్టం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానం లో పరిసమాప్తమయ్యింది. నవంబర్ 15 ఉదయం తెల్లవారుఝామున కృష్ణ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.
అభిమానుల సందర్శనార్థం నానక్ రామ్ గూడలోని కృష్ణ స్వగృహంలో పార్దీవ దేహాన్ని ఉంచారు. ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్ లోని పద్మాలయా స్టూడియోస్ కు తరలించగా అక్కడికి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. కృష్ణకు తుది వీడ్కోలు ఇవ్వడానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానులను కంట్రోల్ చేయడం పోలీసులకు కష్టమైంది. దారిపొడవునా సూపర్ స్టార్ అమర్ రహే అంటూ నినాదాలు ఇస్తూ తమ అభిమాన కథానాయకుడికి తుది వీడ్కోలు పలికారు. పలువురు సినీ , రాజకీయ ప్రముఖులు కృష్ణకు ఘనమైన నివాళి అర్పించారు.