
నేను సినిమాలు తగ్గించుకోవడం ఏంటి ? అసలు నాకు సినిమాల్లో ఛాన్స్ లు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి. తెలుగులో పలు చిత్రాల్లో అక్క, అత్త , పిన్ని పాత్రల్లో నటించిన భామ సురేఖావాణి. అయితే ఒకప్పుడు చాలా బిజీగా ఉండేది. కానీ తన భర్త మరణం తర్వాత ఈ భామకు చాలా గ్యాప్ వచ్చింది.
అప్పటి నుండి సురేఖావాణికి పెద్దగా పాత్రలు రావడం లేదు. అయితే భర్త చనిపోయిన సమయంలో చాలా సినిమాలు కుదరలేదు ….. అలా ఆ గ్యాప్ అప్పటి నుండి కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఆమె నటించడం లేదని అనుకుని ఇచ్చేవాళ్ళు కూడా క్యారెక్టర్ లు ఇవ్వడం లేదు. దాంతో ఈ భామకు అవకాశాల్లేకుండా పోయాయి.
తాజాగా స్వాతిముత్యం అనే చిత్రంలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన ఈ భామ అసలు విషయాన్ని వెల్లడించింది. నాకు ఛాన్స్ లు రావడం లేదు అందుకే నటించలేకపోతున్నాను. ఛాన్స్ వస్తే ఎందుకు నటించను అని ప్రశ్నిస్తోంది. ఇక ఈ భామ తన కూతురుతో కలిసి అందాల ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది.