అగ్ర నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడట. వైజాగ్ లోని జ్యోతి అనే థియేటర్ ని అమ్మినట్లుగా తెలుస్తోంది. దాంతో ఈ వార్త వైరల్ గా మారింది. సురేష్ బాబు కు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల థియేటర్ లు ఉన్నాయి. అయితే వైజాగ్ లో సింగిల్ థియేటర్ అయిన జ్యోతి థియేటర్ ఒకప్పుడు చాలా ఫేమస్ కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
దాంతో సింగిల్ థియేటర్ లకు పెద్దగా జనాలు రావడం లేదు. అలాగే సినిమాలు చూడటానికి ఇలాంటి థియేటర్లకు పెద్దగా ప్రేక్షకులు రావడం లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప ఇలాంటి సింగిల్ థియేటర్ లకు జనాలు రావడం లేదు కాబట్టి అలాంటి వాటిని భరించాలంటే డబ్బులు ఎదురు కట్టాలి అనే భావనతో వైజాగ్ థియేటర్ ని సురేష్ బాబు అమ్మేసినట్లు సమాచారం.
Breaking News