తమిళ స్టార్ హీరో సూర్య తాజాగా బాల దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని దర్శకుడు బాల స్వయంగా వెల్లడించడం విశేషం. ఇంతకీ ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటో తెలుసా ……. సూర్య ఇమేజ్ కు తగ్గట్లుగా ” వనన్ గాన్ ” సినిమా కథ లేకపోవడమే నట !
ఈ సినిమా రెండు నెలల కిందట ప్రారంభమైంది. సూర్య కెరీర్ ప్రారంభంలో బాల దర్శకత్వంలో నటించాడు. ఆ సినిమా ” శివపుత్రుడు ”. మెయిన్ హీరో విక్రమ్ కాగా మరొక హీరోగా సూర్య నటించాడు. శివపుత్రుడు చిత్రం మంచి హిట్ అయ్యింది. అలాగే సూర్యకు కూడా చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. కట్ చేస్తే 20 సంవత్సరాల తర్వాత బాల దర్శకత్వంలో నటించే ఛాన్స్ రావడంతో వనన్ గాన్ చిత్రాన్ని సూర్య నే తన సొంత బ్యానర్ పై నిర్మించడం విశేషం.
ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో అటు సూర్యకు ఇటు బాలకు కూడా కొంత అపనమ్మకం ఏర్పడిందట. దాంతో ఇద్దరూ చర్చించుకొని సూర్య ఈ సినిమా నుండి వైదొలగాలని అనుకున్నాడట. దాంతో ఇదే విషయాన్ని బాల ధ్రువీకరించాడు తాజాగా. మరి సూర్య పాత్రలో ఎవరు నటిస్తారు ? సూర్య సొంత బ్యానర్ పైనే ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుందా ? అన్నది తేలాల్సి ఉంది. దర్శకుడు బాల ఒకప్పుడు ఫేమస్ కానీ ఇటీవల కాలంలో సరైన సినిమాలు చేయలేకపోతున్నాడు. తెలుగు అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ్ లో రీమేక్ చేసినప్పుడు బాల నే దర్శకుడు. అయితే విక్రమ్ కు బాల టేకింగ్ నచ్చకపోవడంతో అతడ్ని తొలగించి మరొక యువ దర్శకుడితో ఆ సినిమా నిర్మించాడు.