
షాకింగ్ న్యూస్ ……. డైరెక్టర్ లింగుస్వామికి తమిళనాడు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. తమిళనాట ఓ ఫైనాన్షియర్ దగ్గర కోటి 30 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు డైరెక్టర్ లింగుస్వామి అతడి సోదరుడు. అయితే ఆ సొమ్ము నిమిత్తం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సదరు ఫైనాన్షియర్ కోర్టుని ఆశ్రయించాడు. దాంతో పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది కోర్టు.
దాంతో షాకైన లింగుస్వామి పై కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నాడు. లింగుస్వామి తమిళనాట పెద్ద డైరెక్టర్. తెలుగులో కూడా ఈయన దర్శకత్వం వహించిన చిత్రాలు డబ్ అయి సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఇక తెలుగులో కూడా ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లతో సినిమాలు చేయాలని గట్టి ప్రయత్నాలే చేసాడు. అయితే వాళ్ళు అవకాశం ఇవ్వలేదు కట్ చేస్తే అదే కథతో రామ్ తో ” వారియర్ ” అనే చిత్రం చేసాడు. ఇటీవలే విడుదలైన ఆ చిత్రం డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే.






