ఎస్వీ కృష్ణారెడ్డి …… ఒకప్పుడు సిల్వర్ జూబ్లీ లు , గోల్డెన్ జూబ్లీలను అందించిన దర్శకుడు. 90 వ దశకంలో తెలుగునాట కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన చిత్రాల్లో దాదాపు 95 శాతం బ్లాక్ బస్టర్ లే అంటే అతిశయోక్తి కాదు సుమా ! అంతగా తెలుగు తెరను ప్రభావితం చేసాడు.
అయితే వరుస విజయాలు సాధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా వరుస పరాజయాలు ఎస్వీ కృష్ణారెడ్డిని పలకరించాయి. దాంతో కొంతకాలం దర్శకత్వానికి దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత యమలీల 2 అనే చిత్రానికి శ్రీకారం చుట్టాడు. యమలీల బ్లాక్ బస్టర్ కావడంతో యమలీల 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి దానికి తోడు ఎస్వీ కృష్ణారెడ్డి రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం కావడంతో తప్పకుండా హిట్ అవుతుందని అనుకున్నారు.
కట్ చేస్తే యమలీల 2 అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో షాకైన ఎస్వీ డైరెక్షన్ కు దూరమయ్యారు. కట్ చేస్తే మరోసారి మెగా ఫోన్ పట్టాలని ఆశపడి ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈరోజు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు ఎస్వీ కృష్ణారెడ్డి మరోసారి నిరాశ పరిచాడు అంటూ పెదవి విరుస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ , బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది. దాంతో ఎస్వీ రిటైర్ అయితే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.