బెల్లంకొండ గణేష్ – వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ” స్వాతిముత్యం ”. దసరా కానుకగా అక్టోబర్ 5 న చిరంజీవి గాడ్ ఫాదర్ నాగార్జున ది ఘోస్ట్ చిత్రాలతో పోటీ పడుతూ స్వాతిముత్యం చిత్రం విడుదల అయ్యింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది కానీ ఆడలేదు. ఇద్దరు స్టార్ హీరోల మధ్య వచ్చిన ఈ సినిమా నలిగిపోయింది.
అయితే ఓటీటీ లోకి రావడానికి కనీసం 50 రోజులైనా పడుతుందని అనుకున్నారు కట్ చేస్తే వెంటనే ఓటీటీ లోకి ఈ చిత్రం వస్తోంది. ఈనెల 28 న ఆహా లో స్వాతిముత్యం చిత్రం స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. వెండితెర మీద అంతగా ప్రభావం చూపలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.