
తెలుగుతెరపై చెరగని ముద్ర వేసిన కథానాయికల్లో జమున ఒకరు. సత్యభామ పాత్రలోకి పరకాయప్రవేశం చేసి మెప్పించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జమున తర్వాత చాలా మంది హీరోయిన్ లు సత్యభామగా నటించారు కానీ జమున లా మెప్పించలేకపోయారంటే అతిశయోక్తి కాదు సుమా ! అంతగా ప్రభావం చూపించింది జమున.
ఆ పాత్రలోనే కాదు నిజ జీవితంలో కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న ఘనాపాటి జమున. అలాంటి జమున జనవరి 27 న తన 86 వ ఏట పరమపదించారు. దాంతో ఆమె బయోపిక్ తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. జమున బ్రతికి ఉన్న సమయంలోనే బయోపిక్ ప్రస్తావన రావడం , ఆమె అంగీకరించడం జరిగాయి.
ఇక జమున పాత్రలో మిల్కీ బ్యూటీ తమన్నా పోషించనున్నట్లు తెలుస్తోంది. తమన్నాకు కథ చెప్పడం ఆమె అంగీకరించడం జరిగినట్లు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖుల బయోపిక్ లు వెండితెర పై వచ్చిన విషయం తెలిసిందే. అందులో కొన్ని హిట్ అయ్యాయి మరికొన్ని ప్లాప్ అయ్యాయి. అయితే జమున బయోపిక్ తప్పకుండా ప్రేక్షకులను అలరించడం ఖాయమని భావిస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమాకు కావాల్సిన అన్ని అంశాలు ఆమె కథలో ఉన్నాయి కాబట్టి.