
రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి హీరోలు భయపడతారని సంచలన వ్యాఖ్యలు చేసింది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రతీ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఉంటాయని , అయితే అలాంటి సన్నివేశాల్లో నటించడానికి హీరోయిన్ లకు భయం అని అనుకుంటారు అందరూ …….. కానీ అది వాస్తవం కాదని ఎందుకంటే అలాంటి సన్నివేశాల్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదని , హీరోలు మాత్రమే భయపడతారని ఎందుకంటే నేను చాలా మంది హీరోలను గమనించానని సంచలన వ్యాఖ్యలు చేసింది.
తెరమీద రొమాంటిక్ సీన్స్ చూడటానికి ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. అందుకే దర్శక నిర్మాతలు హీరో హీరోయిన్ ల మధ్య రొమాంటిక్ సీన్స్ పెడతారు. అయితే షూటింగ్ సమయంలో మాత్రం చాలామంది ముందు రొమాన్స్ చేయాలంటే హీరోలు కొంచెం ఇబ్బంది పడతారట. హీరోయిన్ లకు మాత్రం అంత భయం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది తమన్నా.
తాజాగా ఈ భామ విజయ్ వర్మ అనే నటుడితో పీకల్లోతు ప్రేమలో ఉంది. ఇన్నాళ్లు ప్రేమ విషయంలో పెద్దగా ఫోకస్ కాలేదు కానీ ఈమధ్య ఎందుకో పబ్లిక్ గానే లవర్ తో తిరుగుతూ బాగానే ఎంజాయ్ చేస్తోంది తమన్నా.