
నందమూరి తారకరత్న తన కూతురుతో ఆడుకున్న చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తారకరత్న తన కూతురుతో ఆడుకున్న సమయంలో తీసిన వీడియోను తారకరత్న కూతురు నిష్క సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడా వీడేమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తారకరత్న హిందూపురంకు వెళ్లేముందు తన కూతురుతో కొద్దిసేపు ఆడుకున్నాడు. కాగా ఆ వీడీయోను ఇపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరోసారి తన భర్తను గుర్తు చేసుకొని కన్నీళ్ల పర్యంతం అయ్యింది అలేఖ్యా రెడ్డి. నందమూరి తారకరత్న కుప్పంలో జరిగిన నారా లోకేష్ పాదయాత్ర కోసం వెళ్లిన సమయంలోనే గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే.
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు మహాశివరాత్రి రోజునే మరణించడం గమనార్హం. తారకరత్న మరణంతో నందమూరి కుటుంబం తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. ఇక నందమూరి బాలకృష్ణ అయితే బాగా చలించిపోయాడు. అందుకే తారకరత్న పేరు మీద హిందూపురంలో తాను నిర్మించిన ఆసుపత్రిలోని ఓ బ్లాక్ ను ఏర్పాటు చేసాడు. అంతేకాదు గుండెపోటుతో ఎవరూ మరణించొద్దు అంటూ హిందూపురం లోని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో పడ్డాడు.
View this post on Instagram






