Taraka Ratna Death Live updates: గత ఇరవై రోజులకు పైగా తారకరత్న హాస్పిటల్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే. విదేశీ వైద్యుల పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. అయితే తారకరత్న నాడీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో చికిత్సకు స్పందించడం లేదని సమాచారం .. నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఆయన మరణవార్తను అధికారికంగా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. గత 23 రోజులుగా బెంగుళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడించారు. తారకరత్న మృతితో సినీ లోకం విషాదంలో మునిగిపోయింది.
-
సోమవారం ఫిల్మ్ చాంబర్ కు తారకరత్న భౌతిక కాయం తీసుకురానున్నారు. అదేరోజు సాయంత్రం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
- నందమూరి తారకరత్న మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నందమూరి తారకరత్న అకాల మరణం ఎంతో బాధించిందన్నారుఉ. అత్యంత ప్రకాశవంతమైన, ప్రతిభావంతులైన, ఆప్యాయతగల యువకుడు అని కొనియాడారు. చాలా త్వరగా మనల్ని విడచి వెళ్లిపోయాడని అన్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులందరికీ సానుభూతి తెలిపారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.