నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి తీవ్ర అస్వస్థతకు లోనయ్యింది దాంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. తారకరత్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది అలేఖ్య. జనవరి 27 న లోకేష్ తో పాదయాత్ర చేస్తూ అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. దాంతో అప్పటి నుండి హైదరాబాద్ నుండి కుప్పంకు అక్కడి నుండి బెంగుళూరు కు వెళ్ళింది. 23 రోజుల పాటు తారకరత్న కోలుకుంటాడని , తిరిగి మాములు మనిషి అవుతాడని అనుకుంది.
ఎన్నో దేవుళ్ళకు మొక్కుకుంది. అయితే ఎన్ని పూజలు చేసినా , ఎంతగా ఏడ్చినా తారకరత్న ను ఆ దేవుడు తీసుకెళ్లి పోవడంతో తీవ్ర దుఃఖసాగరంలో మునిగింది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్లు కూడా లేకుండా …… రాకుండాపోయాయి. దానికి తోడు 25 రోజులుగా సరైన తిండి , నిద్ర లేకపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. బాగా నీరసించి పోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఫ్లూయిడ్స్ ఇవ్వడం వల్ల ఆమె కోలుకునే అవకాశం ఉంది కాబట్టి కుటుంబ సభ్యులు అలేఖ్య ను ఆసుపత్రికి తరలించారట. తండ్రి చనిపోవడం , తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడం తో తారకరత్న – అలేఖ్య పిల్లలు రోధిస్తున్నారట. దాంతో ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూడలేక పోతున్నారు కుటుంబ సభ్యులు.