
మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. జూబ్లీహిల్స్ లో మెగాస్టార్ ఓ నిర్మాణం చేపడుతున్నారు. దాంతో ఆ కట్టడం కట్టొద్దని మెగాస్టార్ చిరంజీవికి అలాగే జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి నోటీసులు జారీ చేసింది. ఈనెల 25 లోపు సమాధానాలు ఇవ్వాలని కోరింది. అలాగే ఏప్రిల్ 25 న తదుపరి విచారణ ఉంటుందని ఆదేశాల జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.
జూబ్లీహిల్స్ లోని హౌసింగ్ సొసైటీ ద్వారా వచ్చిన స్థలాన్ని మెగాస్టార్ చిరంజీవి కొన్నారు. ఆ స్థలంలో కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఆ స్థలం ప్రజల ప్రయోజనార్థం కేటాయించిన స్థలం కాబట్టి వ్యక్తిగత నిర్మాణాలు చేపట్టొద్దని కోర్టుకెక్కారు. దాంతో తెలంగాణ హైకోర్టు అటు మెగాస్టార్ చిరంజీవికి ఇటు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కి నోటీసులు జారీ చేసింది.
ఇక చిరంజీవి సినిమా విషయానికి వస్తే…… భోళా శంకర్ అనే చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని పలు లోకేషన్ల లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.